సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా కరెంట్ షాక్..ఒకరు మృతి...

నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ లో మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కొట్టి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. 

Electric shock while talking while charging cell phone, one died in nellore

నెల్లూరు : సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ముత్తోలినగర్ లో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఉరుములు మెరుపులు ఇది తగ్గటానికి కారణంగా తెలుస్తోంది. ముత్తోలినగర్ కు చెందిన ఎస్. సాల్మన్, సులోచన దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ (29) మంగళవారం సాయంత్రం వర్షం పడుతుండగా ఇంట్లో సెల్ఫోన్ చార్జింగ్ పెట్టాడు. అప్పుడే అతడికి ఫోన్ వచ్చింది. ఫోన్ చార్జింగ్ లో ఉండడంతో అలాగే ఫోన్ మాట్లాడాడు.  

అయితే, అదే సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీతారామపురం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రవీణ్ కుమార్ పాస్టర్ గా శిక్షణ తీసుకున్నాడు. మరో రెండు నెలల్లో ఫాస్టర్ గా పనిచేసేందుకు వెళ్లాల్సి ఉందని అతని సోదరుడు ప్రశాంత్ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ దంపతులు భోరున విలపిస్తున్నారు. 

బాలికపై యాసిడ్ దాడి చేసింది మేనమామే... డబ్బుకోసమే ఘాతుకం....

ఇదిలా ఉండగా, గతంలో ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సెల్ ఫోన్ పేలి ఓ వికలాంగుడు మరణించాడు. అతను రాత్రి పడుకునే సమయంలో తన సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టాడు. ఆ తరువాత, దాన్ని తన కడుపుపై పెట్టుకున్నాడు. అలాగే పడుకుండిపోయాడు. అయితే నిద్రపోతున్న సమయంలో సెల్ ఫోన్ పేలింది.  దీంతో ఆ దివ్యాంగుడు నిద్రలోనే మరణించాడు. 

వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి (30) వికలాంగుడు. అతడు ఒంటరివాడు. మస్తాన్ రెడ్డి తల్లిదండ్రలు చిన్నపుడే చనిపోయాడు. దీంతో ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఇంట్లోనే చిన్న తినుబండారాల దుకాణం పెట్టుకున్నాడు. ఈ స్వయం ఉపాధితో తన జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, అతడు ఆ రోజు రాత్రి పడుకునే ముందు.. తన ఇంట్లోనే సెల్ ఫోన్ ను చార్జింగ్ పెట్టాడు. వికలాంగుడు అవ్వడం వల్ల ఏదైనా ఫోన్ రాగానే లేవడం కష్టం అనుకున్నాడో ఏమో.. పోన్ తన కడుపుపై పెట్టుకుని నిద్రపోయాడు.

అతడు నిద్రలోకి జారుకోగానే.. షాట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో చార్జింగ్ పెట్టిన... మస్తాన్ రెడ్డి పొట్టపై వున్న సెల్ ఫోన్ పేలింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే, ఇది తెల్లవారి కానీ ఎవ్వరికీ తెలియలేదు. తెల్లవారి చాలాసేపు అయినా కూడా దుకాణం తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. కాలిన గాయాలతో మస్తాన్ శవమై పడివున్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన రాత్రే గ్రామంలోని మరి కొన్ని ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయనట్లు పోలీసులు గుర్తించారు. ఇలాగే సెల్ ఫోన్ కూడా పేలి ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios