14వ తేదీలోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల అందించిన బలంతోనే తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.

14వ తేదీలోపే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మేదరిమెట్ల సిద్ధం సభలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని తెలిపారు. ఆయన జేబులో మరో నేషనల్ పార్టీ కూడా ఉందని తెలిపారు. వీరంతా కలిసి ఏపీ భవిష్యత్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

ఎన్నికల కమిషనర్ రాజీనామాకు కారణమేంటో ప్రభుత్వమే చెప్పాలి - అసదుద్దీన్ ఒవైసీ

అందరూ కలిసి వైఎస్ జగన్ ను ఓడించడానికి చూస్తున్నారని అన్నారు. కానీ తాను మాత్రం పేదలను గెలిపించేందుకు చూస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. తనకు స్టార్ లు లేరని, స్టార్ క్యాంపెయినర్లు లేరని అన్నారు. అబద్దాలు ప్రసారం చేసే ఎల్లో మీడియా అసలే లేదని తెలిపారు. ఏ పార్టీతోనూ వైఎస్ ఆర్ సీపీకి పొత్తులు లేవని అన్నారు.

బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ప్రజల దీవెనలతోనే తమ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తోందని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇచ్చి దత్త పుత్రుడిని తెచ్చుకున్నాడని ఆరోపించారు. ఆయన సైకిల్ దిగమంటే దిగుతాడని, కూర్చొమంటే కూర్చుంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయని, ఆ మూడు పార్టీలు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ వీరంతా కలిసి వస్తున్నారని తెలిపారు.