ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఊహించని షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)  నిమ్మలగడ్డ రమేష్ కుమార్ కి సీఎం జగన్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సోమవారం ఉదయం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశారు.

Also Read జగన్ ప్రభుత్వం ఫైట్: ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ నీలం సహానీ లేఖ..

రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గర్నవర్ కి వివరించినట్లు సమాచారం. ఎస్ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం లేవనెత్తిన అభ్యంతరాలపై ఎస్ఈసీతో గవర్నర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా.. మరోవైపు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై సీఎం  జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.