అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై భగ్గుమంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై సమరానికి దిగింది. కరోనావైరస్ కారణం చెప్పి ఎన్నికలను వాయిదా వేయడం వెనక ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని జగన్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.

ఎన్నికల వాయిదాను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ముందు జరిగిన తేదీల్లోనే ఎన్నికలు జరిగేలా చూడాలని వారు తమ లేఖల్లో కోరారు. కరోనావైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందని లేఖ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: కరోనా కంటే ప్రమాదకరం.. వెంటనే రాజీనామా చేయాలి: రమేశ్‌పై విజయసాయి ఫైర్

ఇదిలావుంటే, రమేష్ కుమార్ తీరుపై వైఎస్ జగన్ గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశిస్తే ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలనే ఆలోచనలో ఎన్నికల కమిషనర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొద్ది సేపట్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

ఎన్నికలను వాయిదా వేస్తూ రమేష్ కుమార్ ప్రకటన చేసిన వెంటనే వైఎస్ జగన్ ఆదివారం గవర్నర్ ను కలిశారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని నేనా, ఆయనా అని ప్రశ్నించారు. రమేష్ కుమారే అన్ని నిర్ణయాలు తీసుకుంటే తానెందుకని అడిగారు. 

Also Read: రమేశ్‌ను మేం నియమించలేదు.. నేను అడిగింది వేరొకరిని: జగన్ వ్యాఖ్యలపై బాబు కౌంటర్

రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, చంద్రబాబు గ్రాఫ్ పడిపోవడం నచ్చక ఎన్నికలను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కోసమే ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు

Also Read: ఎన్నికల వాయిదాపై జగన్, వైసీపీ నేతల ఆరోపణలు: స్పందించిన ఈసీ రమేశ్ కుమార్