ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం గురువారం నాడు విడుదల చేసింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం గురువారం నాడు విడుదల చేసింది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గుమ్మడి సంధ్యారాణి, గుమ్మదుల తిప్పేస్వామి, వట్టికూటి వీరవెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్ ల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.
మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా కారణంగా ఈ స్థానం 2020 జూలై 1 వ తేదీ నుండి ఖాళీగా ఉంది. అదే విధంగా ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణించారు.దీంతో ఈ స్థానం కూడ ఖాళీగా ఉంది. ఈ స్థానానికి కూడ ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఈ నెల 25వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.నామినేషన్ల స్క్యూట్నీని మార్చి 5వ తేదీన నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ.
మార్చి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 18వ తేదీలోపుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది.