తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఉండటంతో భక్తులు అధికంగా దర్శనానికి వస్తున్నారు. దీంతో క్యూ లైన్లు రెండు, మూడు కిలో మీటర్ల పొడవునా వ్యాపిస్తున్నాయి. 

స్కూల్స్, కాలేజీల‌కు వేస‌వి సెల‌వులు ఉండ‌టంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ర‌ద్దీ పెరిగింది. కుటుంబ స‌భ్యులంతా క‌లిసి వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ వీకెండ్ నుంచి భ‌క్తుల సంఖ్య అధికంగా క‌నిపిస్తోంది. గ‌త శుక్ర‌వారం దాదాపు 70,000 మంది భ‌క్తులు తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నార‌ని అధికారులు తెలిపారు. శ‌నివారం భ‌క్తులు క్యూలైన్ల‌లో దాదాపు 10-12 గంట‌ల పాటు వేచి ఉన్నార‌ని చెప్పారు. 

విశాఖపట్నంలో వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. పెళ్లికి మూడు రోజుల ముందు చాటింగ్.. అతడి కోసమే ఇలా..

భ‌క్తుల సంఖ్య పెర‌గ‌డంతో ఆల‌య ఖ‌జానా కూడా భారీగా పెరుగుతోంది. శుక్ర‌వారం భ‌క్తులు రూ.3.91 కోట్ల విరాళాలు స్వామివారికి స‌మ‌ర్పించార‌ని ఆల‌య అధికారులు తెలిపారు. భ‌క్తుల రాక పెర‌గ‌డంతో క్యూలు వైకుంటం క్యూ కాంప్లెక్స్-II దాటి మూడు కిలోమీటర్ల వరకు విస్తరించాయి. కాగా లేపాక్షి సర్కిల్ వద్ద క్యూలైన్ల ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు.

jagan davos tour : గౌతమ్ అదానీతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

అధిక రద్దీ కారణంగా చాలా మందికి వసతి, బహిరంగ ప్రదేశాల్లో భ‌క్తులు విశ్రాంతి తీసుకోలేకపోయారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు క్యూలైన్లను నిర్వహించి, భక్తులకు ఆహారం, నీరు, ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేశారు. రద్దీ కారణంగా వీఐపీ దర్శనాన్ని నిలిపివేయడంతో పాటు ఎంపిక చేసిన సేవలను కూడా ఆపివేయాల్సి వ‌చ్చింద‌ని ధ‌ర్మారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.