Asianet News TeluguAsianet News Telugu

jagan davos tour : గౌతమ్ అదానీతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ సీఎం వైఎస్  జగన్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కీలక అంశాలపై చర్చలు జరిపారు. 
 

ap cm ys jagan meet adani group chairman Gautam Adani at world economic forum summit 2022 davos
Author
Davos, First Published May 22, 2022, 7:41 PM IST

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ సీఎం వైఎస్  జగన్ బిజిబిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా పలువురు ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. వీరితో పాటు బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే, వరల్డ్ ఎకనమిక్ ఫోరం మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషేన్‌లతోనూ జగన్ భేటీ అయ్యారు. 

అంతకుముందు స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్‌లో జరుగుతున్న (jagan davos tour) ప్రపంచ ఆర్ధిక సదస్సులో (world economic forum summit 2022)  ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను (ap pavilion) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఆవిష్కరించారు. ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో జగన్  పాల్గొన్నారు. 

ALso Read:దావోస్‌లో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన జగన్... సూటు బూటుతో సరికొత్త లుక్‌లో సీఎం

ఈ సందర్భంగా ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాప్‌తో జగన్ భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకట రెడ్డి తదితరులు వున్నారు. ఇకపోతే.. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం జగన్ సరికొత్త గెటప్ లో దర్శనమిచ్చారు. ఖద్దరు దుస్తులు కాకుండా.. సూటుబూటు ధరించిన జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు.. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం లండన్‌లో ల్యాండ్ అవ్వడంపై వివాదం కొనసాగుతూనే వుంది. దీనిపై శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy)క్లారిటీ ఇచ్చినా ప్రతిపక్ష టీడీపీ (tdp) మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా బుగ్గన ఇచ్చిన వివరణపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) మండిపడ్డారు. రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని ఆయన ఎద్దేవా చేశారు . ఈ ఈమేరకు ఆదివారం అయ్యన్న ట్వీట్ చేశారు. 

''జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడు. జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడు అనేది పచ్చి అబద్ధం. జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్‌ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు. ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది. ఇప్పుడు ఏమి చెబుతావ్ బుగ్గన? చెప్పు ఏ బుర్ర కథ చెబుతావో'' అని అయ్య‌న్న పాత్రుడు నిల‌దీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios