ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆపీసులో విద్యా శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలనకు సీఎం ఆమోదం తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే జూన్)నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. గురువారం ఆయన తన క్యాంప్ ఆఫీసులో విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తి ప్రకారం టీచర్లు ఉండాలని తెలిపారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలని చెప్పారు.
నూతన విద్యావిధానం ప్రకారం కొత్తగా ఏర్పాటవుతున్న స్కూళ్ల కారణంగా సుమారు 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. చాలా మందికి ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వస్తాయని, వారి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన చెప్పారు. స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందని తెలిపారు. ప్రమోషన్లు, బదిలీలు వంటి ప్రక్రియలు జూన్ లోపు పూర్తి అయిపోవాలని అన్నారు.
ప్రతీ మండలం నుంచి రెండు హై స్కూల్ ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దాలనే ఆలోచన ప్రభుత్వం ఉందని అన్నారు. ఇందులో ఒక జూనియర్ కాలేజీ కో-ఎడ్యుకేషన్ కోసమని, మరో కాలేజీ ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలని అన్నారు. మండల రీసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్ అధికారాలు ఉంటాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. పలు రకాల ఆప్స్ కన్నా రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. ఫిజికల్‌గా అటెండెన్స్ ను నమోదు చేయకుండా ఆన్‌లైన్ పద్ధతుల్లోనే దానిని అమల చేయాలని చేసిన సిఫార్సును అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల మార్కులను ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.
టీచర్లను నాన్ నాన్ అకడమిక్ పనులకు వినియోగించకూడని ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కోసం కాకుండా నెలకు ఒకే సారి సమావేశం ఏర్పాటు చేయాలనే సిఫార్సుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అలాగే ఎంఈవోల పోస్టులు భర్తీ కి కూడా సీఎం ఆమోద ముద్ర వేశారు.
స్కూళ్ల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్కూళ్ల లో టాయిలెట్స్, తాగునీరు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులు త్వరగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, దీనిని సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. ప్రతీ రోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పేలా చూడాలని ఆదేశించారు. ఆ పదాన్ని ఎలా నిత్య జీవితంలో ఎలా ఉపయోగించాలో పిల్లలకు సూచించాలని అన్నారు. దీనిని పాఠ్యప్రణాళికలో ఒక భాగం చేయాలని తెలిపారు. 8,9,10 తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ ఉండేలా చూడాలన్నసీఎం చెప్పారు.
