జగన్ కు ఇడి షాక్

ED shocks ys jagan by attaching Rs 117 Cr worth of assets
Highlights

  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. రూ.117.74 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ బుధవారం అటాచ్ చేసింది. ఇది జగన్కు మరో షాక్ అని చెప్పవచ్చు.

గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుకు సంబంధించిన ఛార్జీషీటులో ఈ ఆస్తులను అటాచ్ చేసింది. ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టు, వసంత ప్రాజెక్టుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.

అక్రమాస్తుల కేసులో ఇంతకు ముందు కూడా పలుమార్లు ఈడీ, సీబీఐ జగన్  ఆస్తులను అటాచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇతకు ముందు రెండు సార్లు రూ.749 కోట్ల ఆస్తులు ఒకసారి, ఆ తర్వాత రూ.148 కోట్ల ఆస్తులను మరోసారి అటాచ్ చేసింది.

loader