Asianet News TeluguAsianet News Telugu

Srikakulam Earthquake : శ్రీ‌కాకుళంలో భూప్రకంప‌నాలు.. వీధుల్లోకి జనాలు పరుగులు

Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో ప‌లు చోట్ల‌ స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం రాత్రి భూ ప్ర‌కంప‌నాలు సంభ‌వించాయి.  దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గత వారం రోజుల్లో ఇది రెండోసారి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
 

Earthquake In Srikakulam District
Author
Hyderabad, First Published Jan 5, 2022, 12:28 AM IST

Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో ప‌లు చోట్ల స్వల్పంగా భూకంపం సంభవించింది. మంగ‌ళ‌వారం రాత్రి రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో  భూమి కంపించింది. నిలుచున్న వ్యక్తులు కింద పడిపోయినట్లు అనిపించడం.. శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గత వారం రోజుల్లో ఇది రెండోసారి. కావ‌డంతో  ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలో పాత్రలు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

Read Also :  Omicron Cases in AP: ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. తాజాగా 7 కేసులు

 రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్‌ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంల్లోనూ భూమి కంపించింది. దాదాపు భూమి మూడుసార్లు కంపించిన‌ట్టు స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కొందరు భయంతో నిద్ర కూడా మానుకున్నారు. ఇంటి బయటే గడుపుతున్నారు. కాగా, గతంలోనూ స్థానిక గ్రామాల్లోనిపలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయా పాంత్రాల్లో పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు తెలుస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios