బాపట్ల జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసకున్నాయి. జిల్లాలోని అద్దంకిలో ఆదివారం భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
బాపట్ల జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసకున్నాయి. జిల్లాలోని అద్దంకిలో ఆదివారం భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, ఈ ఏడాది మార్చి నెలలో గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శావల్యాపురం, నూజెండ్ల మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదిలా ఉంటే శుక్రవార హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ధర్మశాలలో శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధర్మశాలకు ఉత్తర-వాయువ్యంగా 57 కి.మీ దూరంలో సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ పేర్కొంది. అయితే భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
