Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా నాల్గవ రోజు బెజ‌వాడ‌ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చి భ‌క్తుల‌కు అనుగ్రహించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. భ‌క్తులు సంఖ్య రోజురోజుకూ క్ర‌మంగా పెరుగుతున్నద‌ని ఆల‌య అధికారులు పేర్కొంటున్నారు.  

Dussehra sharannavaratri Mahotsavam: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా నాల్గవ రోజు బెజ‌వాడ‌ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చి భ‌క్తుల‌కు అనుగ్రహించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. భ‌క్తులు సంఖ్య రోజురోజుకూ క్ర‌మంగా పెరుగుతున్నద‌ని ఆల‌య అధికారులు పేర్కొంటున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నాల్గవ రోజు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చి ప్రజలకు అనుగ్రహించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. మహాలక్ష్మిగా అలంకరించబడిన దుర్గమ్మను దర్శించుకోవడం ద్వారా భక్తులకు సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో అధికారులు, పాలకమండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దర్శనం కల్పించారు.

ఆలయ పూజారుల ప్రకారం, అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవిగా దర్శనం ఇవ్వడం వల్ల నవరాత్రి నాల్గవ రోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆమె రెండు వైపులా గజరాజులతో ప్ర‌త్యేక రూపంలో క‌నిపించారు. బెజ‌వాడ శ్రీక‌న‌క‌ దుర్గామాత‌ శ్రీమహాలక్ష్మి అవతారంలో దేవతకు ఎర్ర కమలాలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గులాబీ రంగు దుస్తులు ధరించడం, అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పఠించడం కూడా గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర సమయంలో భక్తులు సమృద్ధి, సంతృప్తి క‌లుగుతుంద‌నీ, అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల అనేక శుభాలు క‌లుగుతాయ‌ని భావిస్తారు.

ఇదిలావుండ‌గా, పోయిన ఆదివారం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిది రోజులూ కనకదుర్గ అమ్మవారిని పది రూపాల్లో అలంకరిస్తారని ఆల‌య వ‌ర్గాలు తెలిపాయి. మొదటి రోజైన ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటలకు స్నపనాభిషేకం (ఆచారబద్ధమైన స్నానం), అమ్మవారి అలంకరణతో రోజు ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఆదే రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

శరన్నవరాత్రి సందర్భంగా అక్టోబర్ 16న శ్రీ గాయత్రీదేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా, 18న శ్రీమహాలక్ష్మీదేవిగా, 19న శ్రీమహాచండీదేవిగా, 20న సరస్వతీదేవిగా(మూలాక్షత్రం రోజు), అక్టోబర్ 21న శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా, 22న శ్రీ దుర్గాదేవీగా ద‌ర్శ‌నమివ్వ‌నున్నారు. అక్టోబర్ 23న విజయదశమి రోజున రెండు అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీదేవిగా, మధ్యాహ్నం శ్రీరాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జర‌గ‌నుంది.