Asianet News TeluguAsianet News Telugu

ఆ ‘పాము’ని కావాలనే చంపేశారా..?

ఒక వ్యక్తి పాము వద్ద రుమాలు వంటి వస్త్రాన్ని వేసి వెళ్లాడని, వస్త్రం వద్దకు చేరిన పాము కొద్దిసేపట్లో మృతి చెందినట్టు గ్రామస్తులు గుర్తించారు. మంత్రసానిని తీసుకువచ్చి వస్త్రంపై మందు వేసి పామును చంపినట్టు గ్రామస్తులు అనుమానించారు. 

durgada snake killed by SI?

26 రోజులపాటు పూజలు అందుకొని గురువారం అకస్మాత్తుగా చనిపోయిన దుర్గాడ పాముని.. కావాలనే చంపేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో గత 26 రోజులుగా ఓ పాముని సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తూ.. గ్రామస్తులు పూజలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. పాము దానంతట అది చనిపోలేదని.. ఎస్సై చంపాడని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

ఉదయం 10 గంటల వరకు దర్శనమిచ్చిన ఆ పాము సుమారు 11 గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై బి.శివకృష్ణ అక్కడి నుంచి వెళ్లిన కొంత సేపట్లో మృతి చెందిందని ఎస్సైతో పాటు వచ్చిన ఒక వ్యక్తి పాము వద్ద రుమాలు వంటి వస్త్రాన్ని వేసి వెళ్లాడని, వస్త్రం వద్దకు చేరిన పాము కొద్దిసేపట్లో మృతి చెందినట్టు గ్రామస్తులు గుర్తించారు. మంత్రసానిని తీసుకువచ్చి వస్త్రంపై మందు వేసి పామును చంపినట్టు గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఎస్సై శివకృష్ణ చంపించారని వారు ఆందోళనకు దిగారు.

దుర్గాడ నుంచే ఇరుపొరుగు గ్రామస్తులు వేలాదిగా దుర్గాడ జంక్షన్‌లోని 216 జాతీయ రహదారి దిగ్బంధించి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. రాత్రి గ్రామస్తులు రోడ్డుపై మంటను వేసి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ను చెందుర్తి, తాటిపర్తి సెంటర్‌ మీదుగా మళ్లించారు. పిఠాపురం సీఐ అప్పారావు, తహసీల్దార్‌ వై.జయ వారితో పలుసార్లు చర్చించారు. 

ఎస్సైను గ్రామానికి తీసు కు రావాలని పట్టుబట్టారు. పలువురు పార్టీ నేతలు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని నాయకుల సమక్షంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఎస్సై పై కేసు నమోదు చేశామని, గొల్లప్రోలు స్టేషన్‌ విధుల నుంచి తొలగించామని డీఎస్పీ చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన పాము మృతికి కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

రోజూ పూజిస్తున్న పాము మృతి చెందడంతో పాము కళేబరాన్ని పట్టుకుని గ్రామస్తులు రోదించా రు. పట్టుకున్నా పాము ఏమీ చేసేది కాదన్నారు. పాము కళేబరాన్ని పల్లకిపై ఊరేగింపుగా స్థానిక శివాలయంలో ఉంచి రాత్రి అంతా భక్తులు భజన చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios