విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిగాయని దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు అన్నారు. అప్పుడు చంద్రబాబు తన దేవాదాయ శాఖ మంత్రితో రాజీనామా చేయించారా అని ఆయన అడిగారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో 40 దేవాలయాలను కూల్చివేశారని, జనసేన నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేకరపోయారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని ఆయన అంటూ ఎన్నిసార్లు మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించారని ఆయన అడిగారు. 

Also Read: దుర్గగుడి రథంలో మూడు సింహాల ప్రతిమలు అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గగుడి రథాన్ని వాడలేదని సోమినాయుడు గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. 2019లో ఉగాది పర్వదినానికి చివరిసారిగా రథాన్ని వాడినట్లు ఆయన తెలిపారు. మళీలీ సింహాల విగ్రహాలను తయారు చేయిస్తామని ఆయన చెప్పారు. హిందువుల మనోభావాలను కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. 

దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాల నాలుగు ప్రతిమల్లో మూడు మాయమయ్యాయని, దీనిపై ప్రతిపక్షాలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమినాయుడు ఆ ఘటనపై స్పందించారు.