తాగినమైకంలో కన్న కూతురితో అంబోతులా వ్యవహరిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో నీచుడు. ఇందుకు అడ్డుపడిన కన్న తల్లిదండ్రులను చంపడానికి ప్రయత్నించాడు.

 నూజివీడు: కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే కన్నేసాడో నీచుడు. తాగిన మైకంలో ఆంబోతులా వ్యవహరిస్తూ వయసులో వున్న కూతురిపైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మనవరాలిని కొడుకు బారినుండి కాపాడటానికి వృద్ద దంపతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వారినీ చంపడానికి ప్రయత్నించాడు ఈ కసాయి. సభ్యసమాజం తలదించుకునేలా... మానవ సంబంధాలను మచ్చలాంటి ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు (nuzividu) పట్టణంలో బాపునగర్ కు చెందిన మేడూరి రంగారావు లారీ డ్రైవర్. భార్య లేకపోవడంతో కూతురితో కలిసి తల్లిదండ్రుల వద్ద వుంటున్నాడు. ఎప్పుడూ లారీపై దూరప్రాంతాలకు వెళుతూ అప్పుడప్పుడూ ఇంటికి వస్తుంటాడు. ఈ సమయంలోనూ కుటుంబంతో గడపకుండా మద్యంమత్తులోనే వుండేవాడు. 

Video

ఇటీవల ఇలాగే ఇంటివద్ద వుంటూ తాగినమైకంలో వయసులో వున్నకూతురు గురించి నీచంగా ఆలోచించసాగాడు. ఇలా కన్నకూతురిపై కన్నేసిన ఈ నీచుడు ఆదివారం రాత్రి దారుణానికి ఒడిగట్టాడు. ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్న ఇతడు నిద్రిస్తున్న కన్నకూతురితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో భయపడిపోయిన యువతి నాన్నమ్మ, తాత వద్దకు వెళ్లి విషయం తెలిపింది. దీంతో వారు కొడుకును అడ్డుకుని మనవరాలిని కాపాడే ప్రయత్నం చేసారు. 

ఈ క్రమంలోనే తనను అడ్డుకుంటున్న తల్లిదండ్రులపైనా రంగారావు విచక్షణారహితంగా దాడి చేసాడు. అంతేకాదు తల్లి మెడలోని మంగళసూత్రాన్ని గొంతుకు బిగించి హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఇరుగుపొరుగు ఇళ్లవారు గుమిగూడి అతడిని అడ్డుకున్నారు.

ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి రంగారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అతన్ని కోర్టు ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో జిల్లా జైలుమని కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇలా వావివరసలు మరిచి కన్న కూతురిపై అఘాయిత్యానికి యత్నించిన నీచున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. బయటే కాదు ఇంట్లోనూ సొంతవారి చేతిలోనే అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవడం దారుణం. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోతోంది. 


ఇదే కృష్ణా జిల్లాలో సొంత అన్న కూతురుపైనే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు ఓ ప్రబుద్ధుడు. తండ్రితో సమానంగా నాన్న అని పిలిచే ఆ చిన్నారిపై అతడు ప్రేమ చూపించకపోగా కనీసం కనికరం కూడా చూపలేదు. అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. 

కంచికచర్ల మండలం కీసరలో ఇటీవల వెలుగుచూసిన చిన్నారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. బాలికపై సొంత బాబాయే అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత బండరాయితో మోదీ హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు సైదులు బాలికను రిక్షాపై ఎక్కించుకుని సుబాబుల్ తోటలవైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 

అయితే ముందు కేవలం హత్య చేసినట్టుగానే పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడిపై హత్యాచారానికి సంబంధించిన కేసులు కూడాపెట్టారు. తాజాగా అన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నీచుడు పెడాల సైదులును పోలీసులు మీడియా ముందు ప్రవేశపట్టారు.