విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. నగరంలోని పైపుల రోడ్డు వద్ద వున్న దుర్గా బార్‌లో నలుగురు యువకులు బ్లేడ్‌తో హల్ చల్ చేశారు. బ్లేడ్‌లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు జీజీహెచ్‌కు తరలించి  చికిత్స అందిస్తున్నారు. మృతుడిని పండు అనే వ్యక్తిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దుర్గాబార్ వద్ద పరిస్ధితిని సమీక్షించారు. అయితే వీరు  మద్యం మత్తులో ఘర్షణకు దిగారా లేదంటే పాత కక్షలు ఏమైనా వున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.