Asianet News TeluguAsianet News Telugu

మంగళగిరిలో రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి: నిందితుడు అరెస్ట్

ఇద్దరు ఆడపిల్లలు  పుట్టడంతో     మద్యం మత్తులో  రెండేళ్ల  చిన్నారిని  కసాయి తండ్రి   నేలకేసి  కొట్టాడు. ఈ ఘటన  గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో  చోటు  చేసుకుంది. 

Drunk father kills 2-year-old daughter  in Mangalagiri  lns
Author
First Published May 29, 2023, 9:47 PM IST | Last Updated May 29, 2023, 9:47 PM IST


గుంటూరు: రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని మద్యం మత్తులో  రెండేళ్ల  కూతురును  నెలకేసి కొట్టి చంపాడు  కసాయి  తండ్రి.ఈ ఘటన  గుంటూరు  జిల్లా  మంగళగరిలో  సోమవారంనాడు చోటు  చేసుకుంది. నిందితుడిని  మంగళగిరి  పోలీసులు  అరెస్ట్  చేశారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని నవులూరు గ్రామంలో ని  ఎంఎస్ పేటలో  గోపి అనే వ్యక్తి  ఎలక్ట్రిషీయన్ గా  పనిచేస్తున్నాడు.  గోపి దంపతులకు  ఇద్దరు ఆడపిల్లలు . అయితే  తనకు మగపిల్లాడు కావాలని  భార్యతో  గోపి గొడవకు దిగేవాడు.  గోపి భార్య  రెండేళ్ల  క్రితం  పాపకు జన్మనిచ్చింది.  ఆరు మాసాల క్రితం  గోపి భార్య  మరోసారి  డెలీవరి అయింది.  అయితే  ఈ దఫా కూడా  గోపి దంపతులకు  రెండో దఫా కూడా ఆడపిల్లే  పుట్టింది.   అయితే  ఇద్దరు ఆడపిల్లలే  కావడంతో  భార్యతో  గోపి గొడవకు దిగేవాడు. తనకు వారసుడు కావాలని భార్యతో  గొడవకు దిగేవాడు. తన వారసత్వం  కాపాడే  కొడుకు  కోసం   భార్యతో  గొడవకు దిగేవాడు.

 

ఇవాళ  సాయంత్రం  మద్యం మత్తులో  ఇంటికి వచ్చాడు గోపి.  వారసుడి విషయమై  భార్యాభర్తల మధ్య గొడవ  జరిగింది. మద్యం మత్తులో   మొదట పుట్టిన  రెండేళ్ల  బిడ్డను  గోపి   నేలకేసి కొట్టాడు. తీవ్ర గాయాలు పాలైన పాపను  విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా  మార్గమధ్యలో  చిన్నారి  మృతి చెందింది. ఆడపిల్లను అత్యంత  పాశవికంగా  హత్య  చేసిన నిందితుడు  గోపిని  కఠినంగా  శిక్షించాలని 'స్థానికులు  కోరుతున్నారు. 
ఈ విషయమై  స్థానికులు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. పోలీసులు నిందితుడిని  అరెస్ట్  చేశారు.  ఈ ఘటనపై  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios