Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ అక్రమ రవాణా కేసు... టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు పోలీస్ నోటీసులు

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ అక్రమరవాణాపై వ్యాఖ్యలు చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

drugs smuggling... kakinada police served notice to dhulipalla narendra kumar
Author
Amaravati, First Published Oct 8, 2021, 9:29 AM IST

గుంటూరు: ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి నోటిసులు అందించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం వున్నట్లు... ఆంధ్ర ప్రదేశ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని ధూళిపాళ్ల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వడానికి విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలని ధూళిపాళ్లకు నోటీసులు ఇచ్చారు కాకినాడ పోలీసులు.  

గత నెల సెప్టెంబర్ 19వ తేదీన గుజరాత్ పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కచ్‌లోని ముంద్రా పోర్టులో రూ. 9 వేల కోట్ల విలువైన Drugs పట్టుకున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఇండియాకు వచ్చినట్టు తెలుస్తున్నది. భారీ కంటెయినర్‌లలో వస్తున్న ఈ డ్రగ్స్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు సమాచారం. విజయవాడలోని (vijayawada) ఆశీ ట్రేడింగ్ పేరు మీద ఈ డ్రగ్స్ సరఫరా అయింది. దీంతో ఈ వ్యవహారంతో ఏపీకి సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  

ఈ నేపథ్యంలోనే టిడిపి నేత dhulipalla narendra kumar కూడా స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ డ్రగ్స్ అక్రమరవాణా వెనక ఉన్న pulivendula పెద్దలు ఎవరో తేలాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో జరిగుతున్న సంఘటనలు చూస్తే ఏపీలో అంతర్జాతీయ మాఫియా రాజ్యమేలుతోందని అర్థమవుతోందని అన్నారు. 

read more  గుజరాత్ డ్రగ్స్ కేసు: డొంక కదిలించేందుకు రంగంలోకి ఎన్ఐఏ

దాదాపు రూ.9వేల కోట్ల హెరాయిన్ అప్ఘనిస్తాన్ నుండి విజయవాడలోని ఆశి ట్రేడింగ్ కంపనీ పేరిటి దిగుమతి అయ్యిందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. దేశాన్నే కుదిపేసిన ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధాలున్నాయని బయటపడిందన్నారు. ఇదొక్కటే కాదు ఇప్పటివరకు దాదాపు 22 కంటైనర్లలో రూ.72కోట్ల విలువైన హెరాయిన్ ఏపికి వచ్చిందని కథనాలు వచ్చాయంటూ ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు చేశారు.

అప్ఘానిస్తాన్ నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న తాలిబన్లకు తాడేపల్లికి వున్న సంబంధమేంటి? వెల కోట్ల హెరాయిన్ ఆఫ్గన్ నుండి విజయవాడకు ఎలా వచ్చింది.? విజయవాడ నుండి ఎక్కడకు తరలివెళ్లింది? దాని వల్ల ఎవరు లబ్ధిపొందారు? అంటూ ధూళిపాళ్ళ ప్రశ్నించారు. ఇలా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios