Asianet News TeluguAsianet News Telugu

వ్రతం చెడ్డా దక్కని ఫలితం : సుజనా చౌదరికి షాక్

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి బీజేపీలో చేరారంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 
 

DRT issued notices to bjp mp sujana chowdary on Evasion of idbi bank
Author
New Delhi, First Published Dec 4, 2019, 4:01 PM IST

న్యూఢిల్లీ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి. కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉంటూ దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే కేంద్రంతో టీడీపీ విబేధించడంతో సుజనా చౌదరి తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 

రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే ఢిల్లీలో చక్రం తిప్పారు. టీడీపీ అధికారంలో ఉండగానే ఆయన్ను కేసులు వెంటాడాయి. సీబీఐ, ఐటీ, మనీలాండరింగ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు సుజనా చౌదరి. 

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే సుజనా చౌదరి బీజేపీలో చేరారంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

బీజేపీలో చేరినా కేసులు మాత్రం తప్పడం లేదు. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ట్యాక్సిస్ ఎంపీ సుజనా చౌదరికి షాక్ ఇచ్చింది. చెన్నైలోని ఐడిబిఐ బ్యాంకు నుండి తీసుకున్న రూ. 135 కోట్లను ఎగొట్టిన కేసులో నోటీసులు జారీ చేసింది. 

డిసెంబర్ 16న డీఆర్టీసీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులలో స్పష్టం చేసిందది. ఎంపీ సుజనా చౌదరితోపాటు ఆయన భార్య పద్మజ మరికొందరికి డిఆర్టీ నోటిసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న ఎగొట్టారంటూ సుజనా చౌదరిపై ఇప్పటికీ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారిషస్ బ్యాంకులో తీసుకున్న రుణంలో రూ. 100 కోట్లను ఎగొట్టిన విషయంలో కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాంపల్లి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఎన్నికలకు నాలుగు నెలల ముందు సుజనా చౌదరిపై సిబిఐ, ఈడి, ఐటి శాఖలు దాడులకు దిగాయి. ఈ దాడులన్నీ కేంద్రప్రభుత్వం యెుక్క కుట్ర అని ఆరోపిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీబీఐ దాడులను నియంత్రించిన సంగతి తెలిసిందే. 

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుజనా బీజేపీలో చేరడం కూడా జరిగిపోయింది. బీజేపీ ఎంపీగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. 

ఇలాంటి తరుణంలో డీఆర్టీ నోటీసులు ఇవ్వడం, ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. టీడీపీ వీడి బీజేపీలో చేరిన సుజనా చౌదరి పరిస్థితి వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు అన్న చందంగా తయారైంది. 

ఇకపోతే బీజేపీ ఎంపీలు సైతం సుజనా చౌదరిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. సుజనా చౌదరిపై ఆరోపణలు వస్తే వాటికి ఆయనే సమాధానం చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సుజనా వ్యక్తిగతం కేసులకు బీజేపీకి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios