డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు : సీబీఐకిఅప్పగింతపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డ్రైవర్ సుబ్రమణ్యం పేరేంట్స్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ డ్రైవర్ పేరేంట్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.ఈ విషయమై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
.2022 మే 19వ తేదీన అనుమానాస్పదస్థితిలో డ్రైవర్ సుబ్రమణ్యం మృతి చెందాడు. ఈ డెడ్ బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు వారి ఇంటి వద్ద కారులో తీసుకెళ్లి వదిలాడు. ఎమ్మెల్సీ అనంతబాబే డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేశాడని పేరేంట్స్, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ కేసులో అనంతబాబును 2022 మే 23న పోలీసులు అరెస్ట్ చేశారు.డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యేనని పోస్టుమార్టం నివేదిక కూడ తేల్చిందని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు.గత ఏడాది డిసెంబర్ 14న ఎస్సీ, ఎస్టీ కోర్టు ఎమ్మెల్సీ అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ అందించింది.