Asianet News TeluguAsianet News Telugu

ఆడవాళ్ళ మోజు తగ్గిపోతోంది...

సహజంగా మన దేశంలో ఏమాత్రం కొనుగోలు శక్తి ఉన్న ఆడవాళ్ల చూపులంతా ముందు బంగారం ఆభరణాలు కొనుగోలు తర్వాత వెండి వస్తువలపైనే పడతాయి. మనదేశంలోని మహిళలకు బంగారంతో విడదీయలేని సంబంధాలున్నాయి. అయినా కొనుగోళ్లు ఎందుకు తగ్గిపోయాయి?

Drastic fall down in gold purchase in the state

బంగారం కొనుగోళ్ళపై ఆడవాళ్ళకు మోజు తగ్గిపోతోందా? రాష్ట్రంలో బంగారు ఆభరణాల కొనుగోళ్ళు పడిపోతున్నాయి. కేంద్రం పెడుతున్న ఆంక్షలు కొనుగోళ్ళపై తీవ్ర ప్రభావమే చూపుతున్నట్లు అర్ధమవుతోంది. వ్యాపారస్తులు కూడా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల కారణంగానే బంగారం కొనుగోళ్లు పడిపోతున్నట్లు గొల్లుమంటున్నారు. 2015-16లో రాష్ట్రం మొత్తం మీద రూ. 182 కోట్ల విలువైన బంగారు ఆభరణాల కొనుగోళ్లు జరిగాయి. అదే 2016-17లో కొనుగోళ్ళ రూ. 128 కోట్లకు పడిపోయాయి. అంటే కొనుగోళ్ళు సుమారు రూ. 68 కోట్లు పడిపోయాయి.

సహజంగా మన దేశంలో ఏమాత్రం కొనుగోలు శక్తి ఉన్న ఆడవాళ్ల చూపులంతా ముందు బంగారం ఆభరణాలు కొనుగోలు తర్వాత వెండి వస్తువలపైనే పడతాయి. మనదేశంలోని మహిళలకు బంగారంతో విడదీయలేని సంబంధాలున్నాయి. అయినా కొనుగోళ్లు ఎందుకు తగ్గిపోయాయి? ఇందుకు రెండు కారణాలను వ్యాపారులు చెబుతున్నారు. ఒకటి: లక్ష రూపాయలు పైన బంగారు కొనుగోళ్ళకు ఖచ్చితంగా చెక్ ద్వాకానే చెల్లింపులు చేయాల్సి రావటం. వ్యక్తిగతంగా ప్రతీ మహిళ వద్ద ఇంతే బంగారం ఉండాలంటూ కేంద్రం పెట్టిన నిబంధన. ఇదే పద్దతి కొనసాగితే కొనుగోళ్ళు మరింత పడిపోతాయంటూ వ్యాపారస్తులు ఘొల్లుమంటున్నారు.

విచిత్రమేమిటంటే అదే సమయంలో సెల్ ఫోన్ల కొనుగోళ్ళు మాత్రం విపరీతంగా పెరుగాయి. మరే రంగంలోనూ లేని విధంగా సెల్ ఫోన్ల కొనుగోళ్లు పెరగటం గమనార్హం. 2015-16లో రూ. 82 కోట్ల విలువైన కొనుగోళ్ళ జరిగితే, 2016-17లో సెల్ ఫోన్ల కొనుగోళ్ళు ఏకంగా రూ. 258 కోట్లకు చేరుకున్నాయి. మొబైల్ కొనుగోళ్ళ తర్వాత ఆటోమొబైల్ కొనుగోళ్ళు 1850 కోట్లకు చేరుకున్నాయి. అంటే రానురాను బంగారు కొనుగళ్ళపై ఆడవాళ్ళకు మోజు తగ్గిపోతుందేమో.

Follow Us:
Download App:
  • android
  • ios