స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం: రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు

స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

Dr Ramesh babu files petition seeking anticipatiry bail in Swarna Palace fire accident

అమరావతి: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్న విషయం తెలిసిందే. 

స్వర్ణ ప్యాలెస్ యజమాని కూడా పరారీలో ఉన్నాడు. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించలేదు. కాగా, కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నోటీసులుఇచ్చినా కూడా తమ ముందు హాజరు కావడానికి సాకులు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. 9 రోజులుగా తమ దర్యాప్తులో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. 

పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలను పంపించారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మరణించిన విషయం తెలిసిందే.

స్వర్ణ ప్యాలెస్ లో రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహించింది. అయితే, షార్ట్ సర్క్యూట్  కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ సెంటర్ నిర్వహణలో పలు నియమాలను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. బిల్లింగ్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios