డా. శ్రీకాంత్ రెడ్డి కిడ్నాప్, హత్య: మృతుడు టిడీపి నేత కుమారుడు

Dr Pocha Srikanth Reddy killed at Dhone
Highlights

కర్నూలు జిల్లా డోన్ లో ఓ వైద్యుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. డాక్టర్ పోచ శ్రీకాంత్ రెడ్డి అనే వైద్యుడిని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.

కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ లో ఓ వైద్యుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. డాక్టర్ పోచ శ్రీకాంత్ రెడ్డి అనే వైద్యుడిని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. డోన్ లోని గురుకుల పాఠశాల వద్ద రాళ్లతో మోది అతన్ని చంపినట్లు పోలీసులు గుర్తించారు. 

శ్రీకాంత్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు మద్దూరి సుబ్బారెడ్డి మనవడు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 

గురువారం సాయంత్రం 4 గంటల నుంచి శ్రీకాంత్ రెడ్డి కనిపించకుండా పోయాడు. అయితే, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో అతను కనిపించిట్లు చెబుతున్నారు. అయితే, అతను శుక్రవారం ఉదయం శవమైన కనిపించాడు. 

తలపై తీవ్రమైన గాయాలున్నాయి. ఈ హత్యకు కారణమేమిటి, ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే విషయాలను రాబట్టడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

loader