అనంతపురం జిల్లా గుంతకల్లులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. పట్టణంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భూస్వామి కోటిరెడ్డి , అతని డ్రైవర్ షేక్‌షా వలీని దారుణంగా నరికి చంపారు దుండగులు. అయితే ఇది ఎవరి పని అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.
