Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి ప్రారంభమైన ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఈ రోజు తాడేపల్లిలో ప్రారంభమయ్యింది.  తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి చంద్రరెడ్డిలు  జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. 

door step ration delivery in andhrapradesh started from today - bsb
Author
Hyderabad, First Published Feb 1, 2021, 10:46 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఈ రోజు తాడేపల్లిలో ప్రారంభమయ్యింది.  తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి చంద్రరెడ్డిలు  జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. 

"

సోమవారం ఉదయం నుంచి అధికారులు రేషన్ బియ్యం పంపిణీని మొదలు పెట్టారు. తమ ఇంటి వద్దకే రేషన్ రావడంతో... గంటల కొద్దీ లైన్లో నిలబడటం రేషన్ డీలర్ల చీదరింపులు ఇక ఉండవని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ఈ కార్యక్రమాన్ని MRO శ్రీనివాసులు రెడ్డి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ రవి చంద్రరెడ్డి  దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జనవరి 21న పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు.  ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయిన విషయం తెలిసిందే. 

లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటికే రేషన్‌ సరుకులు డెలివరీ చేసేందుకు గాను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ఉపయోగించనుంది. ఈ వాహనాల కోసం ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. ఫిబ్రవరి 1నుంచి ఇంటికే రేషన్‌ విధానం ప్రారంభం కానుంది.

రేషన్‌ సరుకులు ఇంటికి డోర్‌ డెలివరీ చేసే క్రమంలో కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ బియ్యం బస్తాకు సీల్‌తోపాటు యూనిక్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios