Asianet News TeluguAsianet News Telugu

పొత్తులపై మాట్లాడ‌కండి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్ దేనికి సంకేతం.. ?

Jana Sena Pawan Kalyan: ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. 
 

Dont talk about alliances. Jana Sena chief Pawan Kalyan's comments are a sign of what? ? RMA
Author
First Published Feb 10, 2024, 9:45 PM IST | Last Updated Feb 10, 2024, 9:45 PM IST

Jana Sena Pawan Kalyan-Electoral Alliances: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన పార్టీలు రానున్న ఎన్నిక‌ల కోసం శంఖారావం పూరించి ముమ్మ‌రంగా గెలుపు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. పొత్తుల అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్ప‌టికే టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి. చంద్ర‌బాబు కూడా ఢిల్లీలో ప‌లువురితో భేటీ కావ‌డం.. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా బయ‌ట‌కు రాక‌ముందే, తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తులు గురించి మాట్లాడ‌వ‌ద్దు అంటూ కామెంట్స్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పొత్తుల  విష‌యంలో ప్ర‌జా సంక్షేమ‌మే ముందుంటుంద‌ని అన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో జతకట్టానని తెలిపారు. ఈ క్ర‌మంలోనే పొత్తుల గురించి, పార్టీ ప‌రిస్థితిని దెబ్బ‌తీసే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం పై పార్టీ క్యాడ‌ర్ ను హెచ్చ‌రించారు. పొత్తుల గురించి వ్యాఖ్యానించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో.. ప్రజా సంక్షేమం-రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పొత్తులు కుదుర్చుకుంటున్నాన‌ని అన్నారు. ఇంకా చర్చలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. దీంతో పొత్తుల‌పై  వ్యక్తిగత అభిప్రాయాలను ప్రసారం చేయడం అనవసరమని అన్నారు.

అవినీతికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స్త‌కే లేదు.. బీఆర్ఎస్ కు ఉత్త‌మ్ కుమార్ వార్నింగ్

అలాగే, పొత్తుల విషయంలో నేతలకు తమదైన అభిప్రాయాలు ఉండటం సహజమే కానీ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ ఇలాంటి కీలక సమయంలో తమ అభిప్రాయాలు పార్టీకి న‌ష్టం క‌లిగించే విధంగా మార‌వ‌చ్చ‌న‌నీ,  పార్టీపై ఆశలు పెట్టుకోకుండా ఉండాలంటే బహిరంగంగా వాదనలు చేయడం మానుకోవాలన్నారు. పొత్తులపై పార్టీ వైఖరితో విభేదిస్తున్న నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా తమ అభిప్రాయాలను పార్టీకి వ్యక్తిగతంగా తెలియజేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తులపై మాట్లాడిన నేతల నుంచి వివరణ కోరుతున్నామ‌నీ, ప్రజలు తమను గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదిలావుండ‌గా, జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ కళ్యాణ్ పొత్తుల‌తో ముందుకు సాగుతుండ‌టంపై ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీతో పాటు బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌నే జ‌న‌సేన అధినేత చూడ‌టం.. పొత్తుల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నే నేప‌థ్యంలో ప‌లువురు నేత‌లు పొత్తుల‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. త‌మ‌కు టిక్కెట్టు ద‌క్కుతుందో లేదోన‌ని ఆందోళ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే పార్టీకి న‌ష్టం క‌లిగించే విధంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ను హెచ్చ‌రిస్తోంది. అయితే, చ‌ర్చ‌ల స‌మ‌యంలోనే ప‌లువురు నేత‌లు ఇలా అసంతృప్తిని వ్యక్తంచేస్తే.. ఒక‌వేళ బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ పొత్తుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డిన త‌ర్వాత రాజ‌కీయాలు ఎలాంటి మ‌లుపు తీరుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

బాబ్రీ మ‌సీదుపై లోక్ స‌భ‌లో అసదుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios