అమరావతి: ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది.ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు, యూనివర్శీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖ తిరుమలగిరి ట్రైబల్ స్కూల్స్ స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని  సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. 

also read:నాలుగోసారి వాయిదా:ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేత

అంతేకాదు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో  విద్యా సంస్థల భూములను తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. 

కోర్టులో కేసులు ఉన్నందున పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలోని సుమారు 29 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చే భూముల విషయంలో పలు కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.