Asianet News TeluguAsianet News Telugu

శునకం ప్రాణం తీసిన నాటుబాంబు... నోటితో కొరకడంతో కుక్క తల ఛిద్రమై మృతి...

గురువారం రాత్రి 10 గంటల సమయంలో శాంతిపురం పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జారీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తరువాత ఘటనా స్థలిని పరిశీలించి పోలీసులకు తెలిపారు. 

dog bites homemade bomb killed by explosion in chittoor
Author
Hyderabad, First Published Jan 28, 2022, 11:53 AM IST

చిత్తూరు : Andhrapradesh లోని chittoor జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో homemade bomb కలకలం చెలరేగింది. అడవి పందుల కోసం ఉపయోగించే నాటుబాంబును dog నోటితో కొరికింది. బాంబు పేలడంతో కుక్క తల ఛిద్రమైన దుర్మరణం పాలయ్యింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటనా స్థలంలోనే కుప్ప కూలి చనిపోయింది. 

గురువారం రాత్రి 10 గంటల సమయంలో శాంతిపురం పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జారీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తరువాత ఘటనా స్థలిని పరిశీలించి పోలీసులకు తెలిపారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని నాటు బాంబులు ఉన్నాయా? అన్న అనుమానంతో సోదాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నాటుబాంబు పేలిన సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. 

ఇలాంటి ఘటనే గతంలోనూ చిత్తూరులో జరిగింది. 2020లోనూ చిత్తూరు జిల్లాలో ఇలాంటి దారుణమే చోటు చేసుకొంది. చిత్తూరు జిల్లాలో వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును పొరపాటున తిన్న ఆవు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా  పెద్ద పంజని మండలం  కొకినేరు గ్రామంలోని ఓ మఠానికి చెందిన ఆవు మేత కోసం వెళ్లి పొరపాటున నాటుబాంబును తిని తీవ్రంగా గాయపడింది.

పొరపాటున నాటు బాంబును తినడంతో అది నోట్లోనే పేలిపోయింది. స్థానికులు వెంటనే గుర్తించి ఆవును ఆసుపత్రికి తరలించారు. పశువైద్యాధికారులు ఆవుకు చికిత్స నిర్వహించారు.  

కాగా, కేరళ రాష్ట్రంలో కూడ ఇదే తరహాలోనే ఓ ఏనుగు కూడ పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ తింది. సుమారు 20 రోజుల తర్వాత ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.

పంటలను కాపాడేందుకు నాటు బాంబులను ఈ ప్రాంతంలో వేటగాళ్లు ఉంచినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆవులు, మేకలు మేత కోసం తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో నాటు బాంబులను ఉంచడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఆవుకు పొరుగున ఉన్న వ్యక్తి పిండిలో నాటు బాంబు కలిపి తినిపించాడు. దీంతో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios