తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఓ డాక్యుమెంట్ రైటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. మృతుడిని కాట్రగడ్డ ప్రభాకర్‌గా తేల్చారు. 

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఓ డాక్యుమెంట్ రైటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. మృతుడిని కాట్రగడ్డ ప్రభాకర్‌గా తేల్చారు. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద వున్న ప్రభాకర్‌పై దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్ ఓ డాక్యుమెంట్ రైటర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.