తారకరత్నకు స్టంట్ వేసిన వైద్యులు: నిలకడగా ఆరోగ్యం
అస్వస్థతకు గురై న సినీ నటుడు నందమూరి తారకరత్నకు కుప్పం మెడికల్ కాలేజీలో స్టంట్ వేశారు. తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు
కుప్పం: అస్వస్థతకు గురైన ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు పీఈఎస్ మెడికల్ కాలేజీలో వైద్యులు స్టంట్ వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళంలో తారకరత్న ఇవాళ పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి తారకరత్న 15 నిమిషాల పాటు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు . అస్వస్థతకు గురైన వెంటనే తారకరత్నను తొలుత కేసీ ఆసుపత్రికి తరలించారు. కేసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఈ ఆసుపత్రి నుండి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు. ఈ మెడికల్ కాలేజీలో తారకరత్నకు స్టంట్ వేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ ఆసుపత్రిలోనే తారకరత్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ నిర్వహించిన సమయంలో ఓ బ్లాక్ ను వైద్యులు గుర్తించారు. వెంటనే స్టంట్ వేశారు వైద్యులు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలోనే బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. తారకరత్న కు అందుతున్న చికిత్స గురించి వైద్యులు బాలకృష్ణకు సమాచారం అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు తారకరత్న ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకున్నారు. లోకేష్ కూడా తారకరత్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. తారకరత్నకు ఎలాంటి చికిత్స అందించారు. తారకరత్నకు ఏం జరిగిందని విషయమై వైద్యులు సమాచారం ఇవ్వనున్నారు.
also read:ఆసుపత్రికి వచ్చినప్పుడు తారకరత్నకు పల్స్ లేదు, శరీరం బ్లూగా మారింది: డాక్టర్లు
హిందూపురంలో టీడీపీ నేత కుటుంబంలో జరిగిన వివాహనికి నిన్న తారకరత్న హజరయ్యారు. బాలకృష్ణతో కలిసి తారకరత్న ఈ వేడుకలో పాల్గొన్నారు. టీడీపీ తరపున తారకరత్న గతంలో పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇవాళ లోకేష్ పాదయాత్రకు తారకరత్న వచ్చారు.