అమలాపురం: అమలాపురం పట్టణానికి డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్యకు రైస్ పుల్లింగ్ ముఠా కారణమని  బాధిత కుటుంబసభ్యుడు ఆరోపిస్తున్నాడు.ఈ మేరకు  రామకృస్ణంరాజు చిన్న కొడుకు వంశీకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 ఈ ఏడాది ఆగష్టు 30వ తేదీన అమలాపురం పట్టణంలోని శ్రీకృష్ణ ఆర్థో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ రామకృష్ణం రాజు, ఆయన భార్య లక్ష్మీదేవి, ఆయన కొడుకు డాక్టర్ కృష్ణ సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కొడుకు అమలాపురంలో లేకపోవడంతో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

రామకృష్ణంరాజు గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. హైద్రాబాద్ కు చెందిన వేణు, అనంతరామ్ అనే వ్యక్తులు రూ. 30 లక్షలు తీసుకొన్నారు. హైద్రాబాద్ కే చెందిన షేక్ షానలీన్ ను డాక్టర్ కు పరిచయం చేశారు. రైస్ పుల్లింగ్ పేరుతో రూ. 2.50 కోట్లు రామకృష్ణం రాజు నుండి తీసుకొన్నారు. ఈ విషయమై రామకృష్ణంరాజు డబ్బులు చెల్లించాలని కోరితే బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో ఆత్మహత్య చేసుకొన్నారని వంశీకృష్ణం రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆగష్టు 30వ తేదీన తనను కూడ చనిపోయేందుకు రావాలని తల్లి ఫోన్ చేసి  పిలిచిందని వంశీకృష్ణం రాజు చెప్పాడు. తాము సెలైన్‌లో విషం ఎక్కించుకొంటున్నామని చెబితే తాను బతిమిలాడినట్టుగా ఆయన చెప్పారు. అయినా కూడ వాళ్లు వినలేదన్నారు.

అదే రోజు ఉదయం 11:15 గంటలకు మా కుటుంబసభ్యులకు సీరియస్ గా ఉందని తనకు సమాచారం ఇచ్చారని  తాను వచ్చే లోపుగానే వారంతా చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైస్ పుల్లింగ్ ముఠాపై వంశీకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అమలాపురంలో డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య