అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో  డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది.

డాక్టర్ కృష్ణంరాజు ఆయన భార్య, కొడుకు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.సెలైన్‌లో విషం ఎక్కించుకొన్నారు. దీంతో ముగ్గురు కూడ మృత్యువాత పడ్డారు.

ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడుగా రామకృష్ణంరాజు పేరొందాడు.  ఈ ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కూడ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.రామకృష్ణం రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై స్పష్టం కాలేదు.

సంఘటన స్థలంలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ లేఖను సూసైడ్ లెటర్ గా  పోలీసులు అనుమానిస్తున్నారు.
 

.