కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఈ మహమ్మారికి తాజాగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ ని ఇటీవల ఫ్రంట్ వారియర్స్ కి అందజేశారు. అందులో వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరికి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వైద్యురాలు అస్వస్థతకు గురయ్యారు.    

కరోనా వ్యాక్సిన్ వికటించడంతో ఒంగోలు రిమ్స్ వైద్యురాలు ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 23న రిమ్స్‌లో డాక్టర్‌ ధనలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 25 నుండి తీవ్ర జ్వరంతో వైద్యురాలు బాధపడుతున్నారు. వెంటనే ధనలక్ష్మిని రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స అనంతరం అధికారులు వైద్యురాలిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే డాక్టర్ ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకి తరలించారు.