ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నాలుగోసారి సీఎం పీఠమెక్కనున్న చంద్రబాబు... తన కేబినెట్ ను సిద్ధం చేసుకున్నారు. మంత్రివర్గంలో సామాజిక వర్గాల వారీగా ప్రధాన్యమిచ్చారిలా....  

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించింది. 164 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈసారి 135 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీడీపీ అవతరించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ రేటుతో 21 స్థానాలనూ గెలుచుకుంది. 10 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 8 చోట్ల పాగా వేశారు. మూడు పార్టీలు సీట్ల కేటాయింపు విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాయి. గట్టి పోటీ ఇచ్చే వారినే అభ్యర్థులుగా నిలబెట్టి... అఖండ విజయాన్ని సాధించాయి.

ఇక నేడు (బుధవారం) చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇందులో భాగంగా తన జట్టును సిద్ధం చేసుకున్నారు. సీనియర్లతో పాటు అత్యధిక మంది కొత్తవారికి తన కేబినెట్ లో అవకాశమిచ్చారు. సామాజిక వర్గాల వారీగా చూసినా బలమైన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటిచ్చారనే అంశం అర్థమవుతుంది.

ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో ఎనిమిది బీసీలతో పాటు 17 మంది కొత్త వారికి అవకాశమిచ్చారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే చంద్రబాబు కేబినెట్ ఇలా ఉంది.

   మంత్రి         సామాజిక వర్గం
కొణిదెల పవన్ కళ్యాణ్కాపు
కింజరాపు అచ్చెన్నాయుడుబీసీ (కొప్పుల వెలమ)
కొల్లు రవీంద్రబీసీ (మత్స్యకార)
నాదెండ్ల మనోహర్ఓసీ (కమ్మ)
పొంగూరు నారాయణకాపు
వంగలపూడి అనితఎస్సీ (మాదిగ)
సత్యకుమార్బీసీ (యాదవ)
నిమ్మల రామానాయుడుకాపు
NMD ఫరూక్ముస్లిం మైనారిటీ
ఆనం రామనారాయణ రెడ్డిఓసీ (రెడ్డి)
పయ్యావుల కేశవ్ఓసీ (కమ్మ)
అనగాని సత్యప్రసాద్బీసీ (గౌడ)
కొలుసు పార్థసారథిబీసీ (యాదవ)
డోలా బాల వీరాంజనేయ స్వామిఎస్సీ (మాల)
గొట్టిపాటి రవికుమార్ఓసీ (కమ్మ)
గుమ్మడి సంధ్యారాణిఎస్టీ
బీసీ జనార్ధన్ రెడ్డిఓసీ (రెడ్డి)
టీజీ భరత్ఓసీ (ఆర్యవైశ్య)
ఎస్ సవితమ్మకురబ
వాసంశెట్టి సుభాష్బీసీ (శెట్టిబలిజ)
కొండపల్లి శ్రీనివాస్బీసీ (తూర్పు కాపు)
మండిపల్లి రామ్ ప్రసాద్ఓసీ (రెడ్డి)
నారా లోకేశ్ ఓసీ (కమ్మ)
కందుల దుర్గేష్ కాపు
నారా చంద్రబాబు నాయుడు ఓసీ (కమ్మ)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సామాజికవర్గంమంత్రి పదవులు
ఓసీ14
బీసీ 08
ఎస్సీ02
ఎస్టీ01
ముస్లిం మైనారిటీ (బీసీ) 01

 

 

 

 

 

 

పార్టీమంత్రి పదవులు
తెలుగుదేశం పార్టీ21
జనసేన పార్టీ03
భారతీయ జనతా పార్టీ01

 

 

 

 

ఇక, మంగళవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. కూటమి తరఫున శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరారు. 

అలాగే, చంద్రబాబు కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించారు.