Asianet News TeluguAsianet News Telugu

పర్సెంట్‌ అర పర్సెంట్‌ అనీల్‌ యాదవ్‌కి ఎంత ఓటు పర్సెంటేజీ వచ్చిందో తెలుసా..?

అనిల్ కుమార్ యాదవ్... 2019లో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయి.. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. పర్సెంటా.. అర పర్సంటా.. అంటూ ఫేమస్ అయిన ఆయనకు ఈ ఎన్నికల్లో ఎంత పర్సెంట్ ఓట్లు పడ్డాయో తెలుసా...?

Do you know the percentage of votes Anil Yadav got?
Author
First Published Jun 6, 2024, 12:26 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి. 2019లో 151 సీట్లు గెలుచుకొని సునామీ సృష్టించిన వైసీపీ.. ఈసారి చతికిల పడింది. 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది. 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షంపై బలంగా ఎటాక్ చేసేవారు. ప్రత్యేకంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడితే మామూలుగా ఉండదు. అంతా మాస్ డైలాగులే ఉంటాయి. అలాగే ఓసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చల సమయంలో ‘‘పర్సంటా.. అర పర్సంటా....’’ అనిల్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. 

ఈసారి ఎన్నికల వేళ నెల్లూరు సిటీ నుంచి బదిలీ అయి పల్నాడు జిల్లా నరసరావు పేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ కు ఎంత పర్సంటేజీ ఓట్లు వచ్చాయంటే... 

నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 85.65 పర్సెంట్ అంటే.. 14,85,909 ఓట్లు పోలయ్యాయి. 

కాగా, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు 1,59,729 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు 8,07,996 ఓట్లు పడ్డాయి. ఇక అనిల్ కుమార్ కు 6,48,267 ఓట్లు దక్కాయి. అంటే అనిల్ కుమార్ 37.36 పర్సెంట్, శ్రీకృష్ణ దేవరాయలుకు 46.57 పర్సెంట్ ఓట్లు దక్కించుకోగలిగారు. 

వైసీపీలో దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు. 2024 ఎన్నికల్లో జగన్న ఆదేశాల మేరకు సొంత నియోజకవర్గాన్ని వదిలి నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. 


బాల్యం, విద్యాభ్యాసం:

పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ..  1980 మార్చి 23న తిరుపాలయ్య, శైలిజా దంపతులకు నెల్లూరు జిల్లా అంబాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు, బాబాయి గ్రామస్థాయి రాజకీయాలలో పంచాయితీ ప్రెసిడెంట్లు గా పనిచేశారు. ఆయన పుట్టింది నెల్లూరు అయినా.. విద్యాభ్యాసం చైన్నైలో సాగింది. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చెన్నైలోని వెంగల సుబ్బారావు స్కూల్లో చదివించారు. తరువాత ఇంటర్ రత్నం జూనియర్ కాలేజీలో చదివించారు.  తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని  MGR యూనివర్సిటీలోని SRM డెంటల్ కాలేజ్ బీడీఎస్ పూర్తి చేశారు. తాను డెంటల్ స్పెషలిస్ట్ గా చేసిన ప్రాక్టీస్ మాత్రం పెద్దగా చేయలేదు. 

రాజకీయ జీవితం

అనిల్ కుమార్ యాదవ్ బాబాయి సుధాకర్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. వీరి కుటుంబానికి ఆనం సోదరుల కుటుంబానికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీనికి తోడు 2008లో నెల్లూరు రెండు సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక సిగ్మెంట్ కి బీసీలకు టికెట్ ఇవ్వాలని ఆనం బ్రదర్స్ అనుకోవడంతో అలా.. అనిల్ కుమార్ కి కాంగ్రెస్ తరపున వైయస్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించారు.

కానీ, ఖర్చు అంతా అనిల్ పెట్టుకోవడం అజమాయిషీ మాత్రం ఆనం సోదరులు చెలాయించడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆనం బ్రదర్స్ వారి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం 90 ఓట్ల అత్యంత స్వల్ప తేడాతో అనిల్ ఓడిపోయారు. అయినా, నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. నెల్లూరు తన సిగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి తన అనుచరులతో నిత్యం ప్రజల్లోనే ఉండేవాడు. 

వైసీపీలో చేరిక

ఆ తరువాత వైయస్సార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.  2011లో వైఎస్ఆర్సిపిలో చేరి జగన్ తో ఇంకా బలమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వైసిపి తరఫున ఏ కార్యక్రమం జరిగిన ముందుండి చురుకుగా ఉండేవారు. 2012లో వైఎస్ జగన్ జైల్లో పెట్టిన 16 నెలలు నిరసనగా బ్లాక్ అండ్ బ్లాక్ లో తిరిగి జగన్ కు వీరభక్తుడయ్యాడు. ఆ తర్వాత 2014లో వైసిపి తరపున నెల్లూరు నుంచి పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్టుతో టిడిపి అభ్యర్థి పై 19,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా 2014లో మొదటి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తరువాత 2019 ఎలక్షన్స్ లో నారాయణపై గెలుపొంది వైసీపీలో మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుకు పరాజితులయ్యారు.

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios