Asianet News TeluguAsianet News Telugu

దీపావళి 2023 : గుడిసెపై పడ్డ తారాజువ్వ, మహిళ సజీవ దహనం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు...

వీరి ఇంట్లో పెట్రోలు నిల్వ చేసి పెట్టుకున్నారు. దీనివల్లే తారాజువ్వ పడగానే చెలరేగిన మంటలు పెద్దగా వ్యాపించడంతో.. ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Diwali 2023 : Tarajuvva collapses woman burnt alive, three others seriously injured In Ambedkar Konaseema - bsb
Author
First Published Nov 13, 2023, 9:00 AM IST | Last Updated Nov 13, 2023, 9:02 AM IST

అంబేద్కర్ కోనసీమ :  దేశవ్యాప్తంగా దీపావళిని అనేకమంది ఎంతో సంబరంగా జరుపుకున్నారు. కొన్నిచోట్ల విషాద ఘటనలు వెలుగు చూసాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఓ పూరింటిపై తారాజువ్వ పడింది. దీంతో అగ్ని ప్రమాదం సంభవించి.. ఓ మహిళ సజీవ దహనం అయ్యింది. కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఓ పూరి గుడిసెలో ఓ కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబానికి చెందిన పెద్దపూడి మంగాదేవి అనే మహిళ ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యింది.  

ఆమె భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరు కూడా మంటల్లో చిక్కుకున్నారు. గాయాలపాలయ్యారు. గాయపడిన ముగ్గురిని కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఇంట్లో పెట్రోలు నిల్వ చేసి పెట్టుకున్నారు. దీనివల్లే తారాజువ్వ పడగానే చెలరేగిన మంటలు పెద్దగా వ్యాపించడంతో.. ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

https://telugu.asianetnews.com/andhra-pradesh/stray-dog-beaten-17-people-at-macherla-akp-s41jqf

అగ్ని ప్రమాద ఘటన సమాచారం తెలియడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 108 సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించి వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  అయితే సహాయక చర్యలు మొదలుపెట్టే ముందే మంటల్లో చిక్కుకొని మంగాదేవి చనిపోయారు. ఈ మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios