చంద్రబాబునాయుడు ప్రకటించిన అభ్యర్ధుల్లో పలువురిపై ఆయా జిల్లాల్లో అంసతృప్తి స్పష్టంగ కానబడుతోంది.

స్ధానికి సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధల ప్రకటనతో అసంతృప్తులు మండిపడుతున్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన అభ్యర్ధుల్లో పలువురిపై ఆయా జిల్లాల్లో అంసతృప్తి స్పష్టంగ కానబడుతోంది. కర్నూలు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల అభ్యర్ధలు విషయంతో తప్ప మిగితా అన్నీ జిల్లాల్లోనూ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా నుండి శిల్పా చక్రపాణి రెడ్డి పోటీలో నిలిచారు. శిల్పా టిడిపిని వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుండి టిడిపిలో చరిన భూమాతో శిల్పా కుటుంబాలకు ఎప్పటి నుండో వైరం ఉంది. దాంతో శిల్పా కుటుంబాన్ని బుజ్జగించటం కోసమే చంద్రబాబు చక్రపాణిరెడ్డిని అభ్యర్దిగా ప్రకటించారు.

ఇక, తూర్పు గోదావరిలో సిట్టింగ్ అభ్యర్ధి బొడ్డు భాస్కరరావును కాదని చంద్రబాబు చిక్కాల రామచంద్రరావు వైపు మొగ్గారు. చిక్కాలతో పోల్చుకుంటే బొడ్డు గట్టి అభ్యర్ధే. పార్టీకి విధేయునిగా ఉండటం, సంవత్సరాల తరబడి ఎటువంటి పదవి లేకపోవటంతో పాటు సామాజిక వర్గ సమీకరణ కూడా చిక్కాలకు కలిసి వచ్చింది. మెజారిటీ ఓట్ల కారణంగా చిక్కాల ఎంఎల్సీ అవటం ఖాయమే. ఇక, అనంతరపురంలో సిట్టింగ్ అభ్యర్ధి మెట్టుగోవిందరెడ్డిని కాదని సిఎం దీపక్ రెడ్డివైపు మొగ్గు చూపారు. దీపక్ తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డికి అల్లుడు. జిల్లాలోని పలువురు నేతలు ఎంతగా ప్రయత్నాలు చేసినా చివరకు టిక్కెట్ దీపక్ నే వరించింది. జెసి కుటుంబానికే మూడో పదవి కూడా దక్కటంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇక, నెల్లూరులో వాకాటి నారాయణ రెడ్డి అభ్యర్ధిత్వం పట్ల ఆనం సోదరులతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు మండిపడుతున్నారు. పశ్చిమగోదావరిలో ఒక దానిని సిట్టింగ్ ఎంఎల్సీ అంగర రామ్మోహన్ రావుకే కేటాయించగా, రెండో సీటును మంతెన సత్యనారాయణరాజుకు కేటాయించారు. ఇద్దరి విషయంలోనూ మిగిలిన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే, మెజారిటీ ఓట్ల కారణంగా ఇద్దరూ గెలవటం తేలికే. చిత్తూరు జిల్లాలో దొరబాబుకు టిక్కెట్ దక్కింది. మెజారిటీ ఓట్ల కారణంగా దొరబాబు గెలవటం సులువే. శ్రీకాకుళంలో స్ధానిక నేతలందరినీ కాదని సిఎం శత్రుచర్ల విజయకుమార్ రాజుకు టిక్కెట్టును కేటాయించారు. విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్లను శ్రీకాకుళంలో టిక్కెట్టు కేటాయించటంతో జిల్లా నేతలందరూ భగ్గుమంటున్నారు. కడపలో బిటెక్ రవి కొద్ది రోజుల క్రితం నుండే ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, అసంతృప్తులతో చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఏమవుతుందో చూడాలి.