Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కేసులో వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ సూటి ప్రశ్నలు..

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మద్యం టెండర్లకు సంబంధించిన మరో కేసు నమోదైన నేపథ్యంలో టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలంటూ పలు ప్రశ్నలు సంధించింది.

Direct questions from Telugu Desam Party to YS Jagan in Chandrababu case..ISR
Author
First Published Nov 1, 2023, 3:34 PM IST

ఏపీలో మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ సోమవారం మరో కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ.. ఏపీ వైసీపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళగిరిలోని ఆఫీసులో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన పలు విమర్శలు చేశారు.

కామారెడ్డిలో గురుకుల విద్యార్థిని సూసైడ్.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన..

కల్తీ మద్యంతో 40 లక్షల మంది పేదలను హాస్పిటల్ పాలుచేసి.. 30వేల ప్రాణాలు బలితీసుకున్న జగన్ రెడ్డి.. గతప్రభుత్వంలో మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పుచేశాడనడం సిగ్గుచేటని అన్నారు. నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24 వేల కోట్లు దిగమింగిన సీఎం.. ఇప్పుడు నిస్సిగ్గుగా టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై నిందలేస్తూ, తన మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు.. తయారీ, సరఫరా, డిస్టీలరీస్ పై సీబీఐ విచారణ కోరే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు.

‘‘ప్రివిలేజ్ ఫీజు తగ్గించారనే ఆరోపణ పచ్చి అబద్ధం.. ప్రివిలేజ్ ఫీజుకి సంబంధించి, చిన్న చిన్న మద్యం వ్యాపారుల్ని విజ్ఞప్తితో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.1800 కోట్లఆదాయం వచ్చింది. ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ల కోసం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారనడం కూడా అవాస్తవమే. నాటి ప్రభుత్వం అప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వానికి రూ.లక్ష పూచీకత్తు సమర్పించి లేబుల్ రిజిస్ట్రేషన్ పొందే వెసులు బాటు కల్పించింది.’’ అని సాంబశివరావు అన్నారు. 

దొరికినంత దోచుకున్నరు.. ప్రమాదానికి గురైన కారు నుంచి లిక్కర్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం.. వీడియో వైరల్..

ఇవే తప్పులు అయితే మరి నేడు వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్ల కు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి. .వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొన్ని డిస్టిలరీలకు మేలు చేశారని.. డిస్టిలరీల ఏర్పాటు విషయంలో స్వార్థ నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తి అవాస్తవాలని అన్నారు. డిస్టిలరీల ఏర్పాటు, వాటి అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లు, చార్టెడ్ అకౌంటెంట్స్ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరించిందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చెప్పిన పీఎంకే, విశాఖ డిస్టిలరీల విషయంలో గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తే, అవే డిస్టిలరీలు ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల అధీనంలో ఎలా  కొనసాగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. 

స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే సీఎం వైఎస్ జగన్.. తాను ఆడమన్నట్టు ఆడే వాసుదేవరెడ్డి ద్వారా చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్రతో, కక్షసాధింపుతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడని అన్నారు. ఆ కేసుని నిరూపించకలేక ఇటు ప్రజల్లో, అటు న్యాయస్థానంలో తీవ్రంగా అవమానపడ్డాడని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తాడని ముందే పసిగట్టిన జగన్, టీడీపీ అధినేతపై మొన్నటికి మొన్న హాడావిడిగా మరో తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. 

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన సుహెల్ దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే సీఎం జగన్ జేబు సంస్థ సీఐడీ ఆయనపై ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటనలకు సంబంధించిన కేసులు నమోదు చేశాయని ఏలూరి సాంబశివరావు అన్నారు. అవి చాలవన్నట్లు తాజాగా చంద్రబాబుపై మద్యం కేసు నమోదు చేశారని ఆరోపించారు. కల్తీమద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మిస్తూ, వైసీపీ నేతలు, మంత్రులతో మద్యం వ్యాపారం చేయిస్తూ, ఆడబిడ్డల మానప్రాణాలను తన మద్యం మాఫియాకు బలిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించారని వ్యాఖ్యలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios