కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలతో కలిసి కర్నూలు జిల్లా ఆత్మకూరు వచ్చారు.
కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలతో కలిసి కర్నూలు జిల్లా ఆత్మకూరు వచ్చారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో అహ్మద్ హుస్సేన్ కు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు ఆనాటి నుంచి అహ్మద్ హుస్సేన్ కు బుడ్డాకు ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఆ తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడం తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిపోయింది. దీంతో మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గంలో వర్గపోరు స్టార్ట్ అయ్యింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదంటూ హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ పలుమార్లు ఆరోపించారు.
అటు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ పార్టీ పరంగా పదవులు అనుభవిస్తున్నారని కానీ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యడం లేదని విమర్శించారు. ఇది ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య మాత్రమే ఉంది.
అయితే తాజాగా మంత్రి ఫరూక్ సమక్షంలో ఆ వర్గపోరు మరోసారి బహిర్గతం అయ్యింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముస్లిం సామాజికవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారి అభివృద్ధికి పాటుపడటం లేదని ఆరోపించారు హజ్ కమిటీ చైర్మన్ హుస్సేన్. దీంతో మంత్రి పర్యటనను అడ్డుకున్నారు.
మంత్రి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనకుండా హుస్సేన్ అనుచరులు అడ్డుకున్నారు. రోడ్డపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. బుడ్డాడౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చెయ్యాలో తోచక మంత్రి ఫరూక్ నోరెల్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
