పార్టీ మారనున్న వైసీపీ కీలక నేత?

did ycp leader janga krishna murthy leaves the patry?
Highlights

పార్టీ మారడంపై జంగా కృష్ణమూర్తి ఏమన్నారంటే..

వైసీపీ కీలక నేత జంగా కృష్ణమూర్తి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? అవుననే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. కాగా.. ఈ ప్రచారాలకు జంగా తాజాగా పులిస్టాప్ పెట్టారు.తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేశారు. 

ఇటీవల పత్రికలు, వాట్సప్‌, ఫేస్‌బుక్‌లలో తను వైసీపీ నుండి వైదొలుగుతున్నట్లు, టిడిపిలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇవన్నీ కల్పితాలని, ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని ఆయన తెలిపారు.
 
పుకార్లు షికార్లు చేస్తుంటే అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామని వివరించారు. గతంలో కూడా చాలా ప్రచారాలు జరిగాయని, ఏవీ నిజం కాలేదని చెప్పుకొచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.

అయితే.. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారంతా.. మొదట పార్టీ మారడంలేదని చెప్పినవారనని.. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీ మారారు. దీంతో జంగా కూడా ఇదే బాటలో పార్టీ మారతారేమోనని మరో ప్రచారం మొదలైంది.
 

loader