Asianet News TeluguAsianet News Telugu

చంద్ర‌బాబు భార్య కూడా వ‌జ్రాలు, వ‌డ్డాణాలు అడిగారా ? - ఎర్ర‌బెల్లి ద‌యాక‌రావును ప్ర‌శ్నించిన ల‌క్ష్మి పార్వ‌తి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ కార్యక్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలే అని ల‌క్ష్మి పార్వ‌తి అన్నారు. తాను ఎలాంటి వడ్డాణమూ అడగలేదని చెప్పారు. 

Did Chandrababu's wife also ask for diamonds and gifts? - Lakshmi Parvati questioned Errabelli Dayaka Rao
Author
First Published Aug 23, 2022, 9:59 AM IST

త‌న‌కు వ‌డ్డాణం ఇవ్వ‌లేద‌నే తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి తెలిపారు. అవ‌న్నీ ఆరోప‌ణ‌లే అని ఖండించారు. ఆయ‌న ఇంకా టీడీపీ ముసుగును తొల‌గించుకోలేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. ద‌యాక‌ర్ రావు వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ సారి ఎన్నికల్లో ‘వార్ వన్ సైడే’.. టీడీపీదే అధికారం.. రఘురామ కృష్ణంరాజు సర్వే..

వైశ్రాయ్ హోటల్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ద‌యాక‌ర్ రావు కీల‌క పాత్ర పోషించార‌ని ల‌క్ష్మి పార్వ‌తి అన్నారు. మ‌రి ఎందుకు ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని అన్నారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు భార్య న‌గ‌లు, వ‌జ్రాలు వంటివి అడిగారా అని ప్ర‌శ్నించారు. అస‌త్య ప్ర‌చారాలు చేయ‌డం త‌గ‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఇక నుండి ఆరు పేపర్లే: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

న‌మ్మ‌క‌ద్రోహులు, ఎన్టీఆర్ మృతికి కార‌ణ‌మైన వారంతా మ‌ళ్లీ ఒక్క‌టి అవుతున్నార‌ని ఈ విష‌యంలో సీఎం కేసీఆర్ కొంచెం అలెర్ట్ గా ఉండాల‌ని చెప్పారు. నంద‌మూరి తారక రామారావు సీఎంగా ఎన్నికైన ఎనిమిది నెల‌ల స‌మ‌యంలోనే త‌న‌ను కార‌ణంగా చూపిస్తూ, చంద్ర‌బాబును ముఖ్యమంత్రిగా చేయాల‌ని ప‌లువురు మీడియా వ్య‌క్తులు (రామోజీరావు, రాధాకృష్ణ‌) చేసిన ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న (ఎన్టీఆర్) స‌మాజానికి చెప్పార‌ని అన్నారు. రాధాకృష్ణ ఓ హోటల్ లో మీడియా వ్య‌క్తుల‌కు న‌గ‌దు అంద‌జేసి, త‌న‌కు, నందమూరి తారక రామారావుకు యాంటీగా, చంద్ర‌బాబు నాయుడికి స‌పోర్ట్ గా న్యూస్ రాయించార‌ని  ఆమె ఆరోపించారు.

ప్రతిపక్షనేతగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నో హామీలు.. అన్ని రికార్డెడ్‌గా వున్నాయి: నారా లోకేష్

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఎబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో ప్ర‌సారం అయ్యే ఓపెన్ హార్ట్ విత్ అనే ప్రోగ్రామ్ మాట్లాడారని ల‌క్ష్మి పార్వ‌తి అన్నారు. ఆయ‌న ఇప్ప‌టికీ టీడీపీని వ‌దులుకోలేక‌పోతున్నార‌ని ఈ ప్రోగ్రాం చూశాక త‌న‌కు తెలిసింద‌ని, త‌న‌పై కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆమె అన్నారు. ఎర్ర‌బెల్లి చేసిన వ్యాఖ్య‌లు వాస్త‌వం అని ప్ర‌మాణం చేయాల‌ని అన్నారు. తాను వ‌డ్డ‌ణం అడిగింది నిజ‌మే అని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ప్ర‌మాణం చేసి చెప్పాల‌ని తెలిపారు. ఎన్టీఆర్ తో తాను చివ‌రి వ‌ర‌కు న‌మ్మ‌కంతోనే ఉన్నాన‌ని చెప్పారు. ఆర్థిక సమ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతుంటే ఓ కుమారుడిలాగా సీఎం జ‌గ‌న్ త‌న‌కు చేయూత‌ను అందించార‌ని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios