Asianet News TeluguAsianet News Telugu

ధర్మాన ప్రసాదరావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత,రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.  

Dharmana Prasada Rao Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 29, 2024, 1:07 PM IST

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత,రాజకీయ నేపథ్యాన్ని తెలుసుకుందాం.  

బాల్యం, విద్యాభ్యాసం  

ధర్మాన ప్రసాదరావు..  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మబగాం గ్రామం చెందిన సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో భారత జాతీయ కాంగ్రెస్ లో సభ్యునిగా చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన వివిధ శాఖలకు మంత్రిగా సేవలందించారు. ధర్మాన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయన భార్య పేరు గజలక్ష్మీ. వారికి ఏకైక సంతానం రామమనోహర్ నాయుడు

రాజకీయ ప్రస్థానం

ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ జర్నీని పరిశీలిస్తే.. ఆయన 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. ఇలా గ్రామస్థాయి రాజకీయాల నుంచి రాష్ట్రస్థాయి రాజకీయాల వైపు అడుగులేశారు. 

ఈ తరుణంలో తొలిసారి 1989లో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ధర్మాన ప్రసాదరావు. ఆ తరువాత వరుసగా 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు బావుటాను ఎగరవేశారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించాడు. అలాగే.. వై.యస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా సేవలందించారు. మరోవైపు 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

వైసీపీలో చేరిక 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన అసెంబ్లీ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత 2013లో వైసీపీ లో చేరారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందిస్తున్నారు. అలాగే.. ఆయన వైఎస్సార్‌సీపీ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీగా, పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇదిలా ఉంటే..  2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ గెలుపొందారు. రెండో విడుత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 2022 ఏప్రిల్ 11న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలోకి ఆహ్వానించి, రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
 
అవినీతి ఆరోపణలు

ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా పనిచేసినప్పుడు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపణాలు రావడంతో ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించాడు. సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios