దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో గోదావరి నదిలో మునిగిన బోటును వెలికితీసే పనులు  మూడో రోజు కూడ ముందుకు సాగలేదు. బుధవారం నాడు భారీ వర్షం కారణంగా  బోటు వెలికతీత పనులను మధ్యలోనే నిలిపివేశారు ధర్మాడి సత్యం బృందం.

బుధవారం నాడు ఉదయం ప్రమాదం జరిగిన స్థలంలో లంగర్లు వేశారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే భారీ వర్షం మొదలైంది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో  బోటు వెలికితీత పనులను మధ్యలోనే నిలిపివేశారు.

మూడు రోజులుగా బోటు వెలికితీత పనుల కోసం ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. మంగళవారం నాడు ఐరన్ రోప్ తెగడంతో మధ్యలోనే బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి.

భారీ వర్షం కారణంగా బుధవారం నాడు బోటు వెలికితీత పనులను మధ్యలోనే నిలిపివేశారు సత్యం బృందం.  గోదావరికి ఎగువ నుండి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా కూడ బోటు వెలికితీతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సత్యం బృందం సభ్యులు తేల్చి చెప్పారు.