Asianet News TeluguAsianet News Telugu

దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది.. డిజిపి గౌతమ్ సవాంగ్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికి తెలుసినవేనని,  దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 

DGP gowtham sawang visit vijayawada kanaka durga temple - bsb
Author
Hyderabad, First Published Jan 27, 2021, 11:09 AM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికి తెలుసినవేనని,  దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 

దేవాలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచాలని, మన సాంస్కృతి, సంప్రదాయలకు దేవాలయాలే మూలం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిమీద దేవాలయాల పాలక మండలి, ఈవోలు చర్చించుకుని దేవాలయాల పరిరక్షణకు ముందుకు రావాలన్నారు.

దుర్గగుడిలో వెండి సింహాల మయంలో చాలా వివాదం తలెత్తింది. వెండి సింహాల మయంతో అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దుర్గమ్మ దయతో ఆ నేరస్తుడుని పట్టుకోవడం జరిగింది. అంతర్వేది రథం దగ్ధం ఘటనతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయిందన్నారు. 

47,734 దేవాలయాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 59,443 దేవాలయాలను సర్వే చేసి వాటికి జీవో ట్యాగింగ్ చేశామని తెలిపారు.  23,832 ఆలయాల్లో గ్రామ రక్షక దళాలను పెట్టే దిశగా చర్యలు చేపట్టాం. దేవాలయలపై దాడులు చేస్తున్న 373 మందిని అరెస్ట్ చేశామని, రాష్ట్రవ్యాప్తంగా గతంలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన 4873 మందిని విచారించామని తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios