తిరుపతి:కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. లాక్ డౌన్ ను రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భక్తులకు తిరుమల వెంకన్న భక్తుల దర్శనాన్ని నిలిపివేసింది టీటీడీ. ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు వెంకన్న దర్శనం నిలిపివేసింది. అయితే శ్రీవారికి ఏకాంత సేవలను యధావిధిగా కొనసాగుతున్నాయి.

also read:మే 3 తర్వాతే భక్తులకు వెంకన్న దర్శనంపై నిర్ణయం: ఈవో సింఘాల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. లాక్ డౌన్ తర్వాత తిరుమలలో సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తూ  దర్శనం కల్పించడంపై ఇప్పటినుండే కార్యాచరణను రూపొందిస్తోంది టీటీడీ.

లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాల ఆధారంగా భక్తులకు ఆలయ ప్రవేశంపై  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 20 నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు టీటీడీ కనీసం రూ. 130 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.