Asianet News TeluguAsianet News Telugu

ఆ స్వామీజి చెప్పాడనే రమేష్ కుమార్ తొలగింపు: దేవినేని ఉమ సంచలనం

కరోనా వైరస్ ఓవైపు రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాజకీయాలపైనే దృష్టి  పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 
Devineni Umamaheshwar Rao Slams AP  CM YS Jagan
Author
Vijayawada, First Published Apr 14, 2020, 7:22 PM IST
గుంటూరు: ఓవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వ శాఖలు మాత్రం సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో 473 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 9 మంది చనిపోయారు... ఇలాంటి కీలక సమయంలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యులను కలెక్టర్ల కార్యాలయంలో కూర్చోబెట్టి డేటా సేకరిస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు ప్రాణాలు పోతుంటే ఈ డాటాను సేకరించడం ఏంటని ప్రశ్నించారు. 

''సామాజిక వ్యాప్తి జరగకూడదని... మూడ దశలోకి వెళ్లకుండా నివారించడానికి అందరూ పనిచేస్తుంటే జగన్ మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలను ఎందుకు పాటించడం లేదు. దీనిపై నేషనల్ హెల్త్ మిషన్ వెంటనే స్పందించాలి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ రాష్ట్రంలో పరిస్థితులను పట్టించుకోవాలి'' అని  సూచించారు. 

''ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై పారదర్శకత లేదు. సీఎం కార్యాలయం దగ్గర నుంచి అన్ని విభాగాలు వాస్తవాలను తొక్కిపెడుతున్నాయి. టెస్ట్ ల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు. 300 కేసుల ఫైనల్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. వీటిని ఎందుకు బయట పెట్టడం లేదు. వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు. బాధ్యత గల మంత్రులు ఏం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు. 

''రాయలసీమలో సాగునీటికి ఇబ్బందులు ఉంటే మంత్రి మాట్లాడటం లేదు. ఎక్కడెక్కడ క్వారంటైన్ సెంటర్లు పెట్టారు, ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టారో చెప్పడం లేదు. మాస్క్ లు, గ్లౌవ్స్ వంటి రక్షణ పరికరాల కొరత ఉంది. ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. వీటన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారు?'' అని  నిలదీశారు.

''సామాజిక వ్యాప్తిని ప్రభుత్వం తొక్కిపెడుతోంది. వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అనుభవం ఉన్న వైద్యుల సేవలను వినియోగించుకోవాలి. అఖిలపక్షాన్ని జగన్ ఎందుకు సంప్రదించడం లేదు? కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది" అని అన్నారు. 

''ఏప్రిల్ 28 నాటికి రాజధాని వైజాగ్ కు వెళ్లిపోవాలని ఓ స్వామి చెప్పాడని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ను మార్చారు. నూతన ఎన్నికల కమిషనర్ ను నియమించారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగుతుంటే వాస్తవాలు తెలుసుకోవాల్సిన సీఎం జగన్ మంత్రి కొడాలి నానితో బూతులు తిట్టిస్తున్నారు. భౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''నేడు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కన్నీరు పెడుతున్నారు. వాస్తవాలు చెబితే జగన్ కు కోపం వచ్చింది. ఎమ్మెల్యేతో బూతులు తిట్టించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడం.  ఐసోలేషన్, క్వారంటైన్ కు వెళ్లాల్సిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో జగన్ తెలుసుకోవాలి.  భేషజాలకు పోకుండా జగన్ కేంద్ర, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ను సంప్రదించాలి'' అని డిమాండ్ చేశారు.  

''మరోవైపు అమరావతిని తరలించాలని చూస్తున్నారు.  ముక్కిన రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదేనా మీ పరిపాలన?  ఓ వైపు ధాన్యం రైతులు నష్టపోతున్నారు. ఈ-క్రాప్ బుకింగ్ సమాచారాన్ని ఎందుకు తొలగించారు. గన్నీ బ్యాగులు ఎందుకు ఇవ్వడం లేదు. దళారులు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి. 200 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వలేదు. అరటి, మామిడి రైతులను ఆదుకోవడం లేదు. ధరల స్థిరీకరణ నిధి ఏమైంది'' అని ప్రశ్నించారు. 

''శాఖల మధ్య సమన్వయం లేదు. 18 లక్షల రేషన్ కార్డులకు నేటికీ రూ.వెయ్యి అందలేదు. కాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే గుంపులు గుంపులుగా తిరిగారు. అధికారులు ఏం చేస్తున్నారు?  మరోవైపు నా గన్ మెన్ల సంఖ్యను తగ్గించారు. మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. గతంలో పరిటాల రవిని చంపారు. సొంత బాబాయి మర్డర్ కేసు మనం చూశాం. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి'' అంటూ మాజీ మంత్రి ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Follow Us:
Download App:
  • android
  • ios