కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాకే సుజనా చౌదరిపై దాడులు జరుగుతున్నాయని.. ఆయనకు సంబంధించిన సంస్థలు, పెట్టుబడులు, బ్యాంకు లావాదేవిలపై ముందస్తు విచారణలు నిర్వహించారన్నారు.

ఆ తర్వాతే సుజనా చౌదరిని ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లోకి తీసుకున్నారని దేవినేని వెల్లడించారు. 3600 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉందని కేంద్రానికి లేఖలు రాసినా స్పందించడం లేదని దేవినేని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా డ్రామాలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.