జగన్ ది మార్నింగ్, ఈవినింగ్ వాక్: దేవినేని ఉమ

First Published 26, Jun 2018, 2:38 PM IST
Devineni Uma comments on YS Jagan's padayatra
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. పట్టిసీమ దండగ అని అడ్డుపడిన జగన్ గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని అన్నారు. 

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్, బిటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్షా స్థలానికి మంత్రి దేవినేని వచ్చారు. వారికి సంఘీభావం తెలిపారు. కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన అన్నారు. 

జిల్లాకు గత ఏడాది 52 టీఎంసీల నీటిని తరలించామని చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి నీటిని ఇచ్చామని తెలిపారు. ఓదార్పుయాత్రతో మభ్యపెట్టాలని జగన్ చూసినా ప్రజలు నమ్మలేదని దేవినేని ఉమ అన్నారు.

loader