ఒళ్లు కొవ్వెక్కి జగన్ పాదయాత్ర: దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు

Devineni Uma comments on YS Jagan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే జగన్ ఉలిక్కిపడుతున్నారని ఆయన అన్నారు. 

పట్టిసీమకు సమాధానం చెప్పకుండా జగన్ తప్పించుకుంటున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ ఒళ్లు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

జగన్ అధికార దాహంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, టిచ్చి నగర్ సందులో చిట్టి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని ్న్ారు. బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర వైఎస్ దేవినేని అన్నారు. 

పట్టిసీమపై విమర్శలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని, వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. కరువు కాలంలో 150 టీఎంసిల నీళ్లు ఇచ్చిన పట్టిసీమపై విమర్శలా అని అడిగారు. దాని వల్ల చెరువులన్నీ నింపామని చెప్పారు. 

జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని మరో మంత్రి దేవిని ఉమామహేశ్వర రావు అన్నారు. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, జగన్ ఒక్క వినతనైనా స్వీకరించారా అని అన్నారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఫ్లై ఓవర్ ఫిల్లర్ పనులు పూర్తయిన తర్వాత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టిస్తామని ఆయన చెప్పారు. బెంజ్ సర్కిల్ కు కాకాని వెంకటరత్నం పేరు పెడుతామని చెప్పారు. 

loader