ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని  మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తేల్చేశారు. సోమవారం మంత్రి పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, 2013 వరకు పోలవరం పనులు ఎందుకు నిలిచిపోయాయో జగన్ చెప్పాలని నిలదీసారు. పోలవరం భూసేకరణ ఖర్చు పెరగడానికి జగన్‌ కారణం కాదా అని మంత్రి మండిపడ్డారు. వైసీపీ పిటీషన్ల వల్లే అమరావతి పనులు రెండేళ్లు ఆలస్యమయ్యాయన్నారు. 2019 నాటికి పోలవరంను పూర్తిచేసేది ఖాయమన్నారు. డయాఫ్రం వాల్, దిగువ కాఫర్‌డ్యామ్, గేట్లు తయారీ పనుల పరిశీలించారు. కాంక్రిట్ పనుల వేగవంతానికి నవయుగ ఏజెన్సీ ముందుకు వచ్చిందని, రైతులు పోలవరం ప్రాజెక్ట్ సందర్శన కోసం వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.